వేములవాడ: కోనరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ కుట్ర చేస్తుందని బీజేపీ నాయకుల విమర్శ
కోనరావుపేట మండలాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. కోటి 84 లక్షల నిధులను మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ విషయంపై బీజేపీ మండల ఉపాధ్యక్షుడు చర్లపల్లి వామన్ స్పందించారు. ఇదో రాజకీయ కుట్రని అన్నారు. 'ఆది శ్రీనివాస్ ను అడుగుతున్నాం. సంవత్సర కాలంగా కోనరావపేట మండల అభివృద్ధి గుర్తుకు రాలేదా మీకు.. రేపో మాపో ఎన్నికలు అనగానే నిధులు ఎలా మంజూరు చేశారో మండల ప్రజలకు సమాధానం చెప్పాలి' అని ప్రశ్నించారు.