చిత్తూరు: చింటూకు భారీ ఊరట! చిత్తూరు మేయర్ కఠారి అనురాధ దంపతుల మర్డర్ కేసులో చింటూకు ఉరిశిక్షతో పాటు రూ.70లక్షలు జరిమానా విధించిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ చింటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. అప్పీల్ పిటిషన్ పెండింగ్లో ఉన్నప్పుడు జరిమానా కట్టాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసి పిటిషన్ క్లోజ్ చేసింది. అప్పీల్ తీర్పు వచ్చే వరకు చింటూ ఆ నగదు కట్టాల్సిన అవసరం లేదు. డీఫాల్ట్ జైలుశిక్ష అమలు సైతం నిలిపివేశారు.