అసిఫాబాద్: శ్రావణి కుటుంబానికి న్యాయం చేయాలి:DYFI జిల్లా అధ్యక్షులు టికానంద్
కుల దురహంకార హత్యకు గురైన శ్రావణి కుటుంబానికి న్యాయం చేయాలని ఈ నెల 22న ASF కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు DYFI జిల్లా అధ్యక్షులు టీకానంద్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం తిర్యాణిలో ఛలో కలెక్టరేట్ కరపత్రాలను ఆయన విడుదల చేశారు. శ్రావణి కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా, 5 ఎకరాల సాగుభూమి, ఇందిరమ్మ ఇల్లు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు.