అసిఫాబాద్: మార్లవాయి గ్రామంలో పైలెట్ ప్రాజెక్టు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో తలుపులు, కిటికీలకు అటవీ అధికారుల వేధింపులు
పైలెట్ ప్రాజెక్ట్ కిందా మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కావాల్సిన తలుపులు,కిటికీలకు ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాదితులు ఆరోపించారు. సోమవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట బాధితులు మాట్లాడుతూ..జైనూర్ మండలం మర్లవాయి గ్రామంలో 69 పైలెట్ ప్రాజెక్ట్ కిందా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయి. కానీ ఇంటి తలుపులు,కిటికీలకు అటవీ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఆసిఫాబాద్ కలెక్టర్ కు పిర్యాదు చేసినట్లు తెలిపారు.