చీపురుపల్లి: 19 న చీపురుపల్లి లో వైసీపీ అభ్యర్థి మంత్రి బొత్స నామినేషన్లు
ఈ నెల 19 శుక్రవారం చీపురుపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ మేరకు ముహూర్తం ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బొత్స చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఐదో సారి ఎమ్మెల్యే గా పోటీ చేయనున్నారు. 2004, 2009 కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గా పోటీ చేసి గెలుపొంది వైయస్ రాజశేఖర రెడ్డి కేబినెట్ లో వివిధ మంత్రి పదవులు చేపట్టారు. రాష్ట్ర విభజన అనంతరం 2014 లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి టిడిపి అభ్యర్థి కిమిడి మృణాళిణి పై ఓటమి పాలయ్యారు.