శ్రీకాకుళం: శానిటేషన్ కార్మికులకు సకాలంలో పనిమట్లు ఇవ్వాలంటూ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు డిమాండ్
మున్సిపల్ సేనిటేషన్ కార్మికులకు సకాలంలో పనిమట్లు ఇవ్వక పొతే వారు ఏలా పనిచేస్తారని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు తిరుపతిరావ్, ప్రధాన కార్యదర్శి కళ్యాణి అప్పలరాజులు ప్రశ్నించారు. సోమవారం శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ అనుబంధ సంగంఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్బంగా సంఘ నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ వర్కర్స్ కు సకాలంలో పనిముట్లు ఇవ్వాలని, అంతే కాకుండా కార్మికులందరికీ పి.ఎఫ్ మరియు గ్రాట్యూటీతో పాటు ప్రమాద బీమా ఇవ్వాలని డిమాండ్ చేశారు.