మార్కాపురం జిల్లా పొదిలి నగర పంచాయతీ ప్రజలు సకాలంలో ఇంటి పన్నులు చెల్లించి నగర పంచాయతీ అభివృద్ధికి సహకరించాలని కమిషనర్ మారుతీ రావు పిలుపునిచ్చారు. పన్నులు సకాలంలో చెల్లించకపోతే రెండు శాతం జరిమానాలతో కట్టవలసి వస్తుందని హెచ్చరించారు. పన్నుల వసూలపై ప్రత్యేక దృష్టి పెట్టి మొండి బకాయిల దారులకు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది అన్నారు. అక్రమ దారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.