ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అన్ని గ్రామాల్లో దళిత, గిరిజన స్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని దళిత గిరిజన సంఘాల జెఏసి రాష్ట్ర అధ్యక్షులు సాకే హరి డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో స్మశాన వాటిక సాధన జీపు యాత్ర ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాయదుర్గంలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లయినా దళిత, గిరిజనలు చనిపోతేరపూడ్చి పెట్టేందుకు ఆరడుగుల స్థలం లేదన్నారు. వివక్ష చూపకుండా తక్షణమే అన్ని గ్రామాల్లో స్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లా అంతటా తిరిగి ఈనెల 16 న కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు.