ములుగు: ప్రమాదకరంగా మారిన ఏటూరునాగారం-కమలాపురం రహదారి #localissue
Mulug, Mulugu | Sep 16, 2025 ఏటూరునాగారం-కమలాపురం మధ్య ప్రధాన రహదారి అధ్వానంగా మారిందని ప్రయాణికులు గొప్పతున్నారు. పలు ప్రాంతాల్లో రోడ్డుపై ఉన్న కల్వర్టుల వద్ద ఇనుప చువ్వలు బయటికి తేలి ప్రమాదకరంగా మారాయన్నారు. నిత్యం వందల సంఖ్యలో ఇసుక లారీలు ఈ మార్గం గుండా వెళ్తున్నాయని, భారీ గుంతలు ఏర్పడి ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు.