మేడ్చల్ జిల్లా పోచారం సర్కిల్ కొర్రముల రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 747, 750 లో గల 1034 గజాల పార్కు స్థలాన్ని కబ్జా చేసిన వారిపై అధికారులు చర్యలు చేపట్టారు. కాలనీవాసులు మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ జరిపి పార్కు స్థలాన్ని చుట్టుముట్టిన కాంపౌండ్ వాల్ ను కూల్చివేసి స్థలాన్ని సోమవారం స్వాధీనం చేసుకున్నారు. వెంటనే స్పందించిన అధికారులకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.