భీమిలి: పిడుగుపాటు ఓ కుటుంబాన్ని ఛిద్రం చేసింది. అచ్యుత్ కుమార్ టేబుల్ టెన్నిస్ కోచ్
పిడుగుపాటు ఓ కుటుంబాన్ని ఛిద్రం చేసిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఈ ఘటన పై అచ్యుత్ కుమార్ (టేబుల్ టెన్నిస్ కోచ్) మాట్లాడారు. మధురవాడ కొమ్మాది గ్రీన్ ఫీల్డ్ మినీ స్టేడియం (స్పోర్ట్స్ కాంప్లెక్స్)లో ఆఫీస్ సభార్డినేట్ గా విధులు నిర్వహిస్తున్న దోహార్తి సూర్యప్రకాష్ (37) సోమవారం గ్రౌండ్లో గ్రాస్ కటింగ్ చేస్తూ ఉండగా పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందాడు. సూర్య ప్రకాష్ స్వగ్రామం ఆరిలోవ దగ్గర గల నెహ్రూ బజార్ లో నివాసం ఉంటున్నారు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత 10ఏళ్లగా జిల్లా స్పోర్ట్స్ అథారిటీ లో అవుట్సోర్సింగ్ విధానంలో ఆఫీస్ సబ్ ఆర్డినేట్ గా పనిచేస్తున్నాడన్నారు.