భీమిలి: మిదిలాపురి ఉడాకాలనీ రహదారిలో రెండోరోజు బడ్డీలు తొలగింపు నిర్వహిస్తున్న జీవీఎంసీ అధికారులు
మధురవాడ మిదిలాపురి ఉడాకాలనీ రహదారిలో బడ్డీలు తొలగింపు కార్యక్రమం రెండోరోజు కొనసాగిస్తున్నారు. ఈ తొలగింపు చర్యలు పట్టణ ప్రణాళిక విభాగ అధికారి శ్రీ లక్ష్మీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. కార్ షెడ్ జంక్షన్ నుండి, గాంధీ విగ్రహం రెవిన్యూ లే అవుట్ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రహదారి విస్తరణలో భాగంగా ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండేందుకు ఆక్రమణ బడ్డీలను తొలగించినట్లు తెలిపారు.