నెల్లిమర్ల: ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలి: కొండగుంపాంలో సిఐ వెంకటేశ్వరరావు
ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని సిఐ వెంకటేశ్వరరావు వెల్లడించారు. నెల్లిమర్ల మండలం కొండగుంపాంలో గురువారం రాత్రి ఓటు హక్కు వినియోగంపై ఎస్ఐ రామ గణేష్ అధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సిఐ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కేసుల్లో ఇరుక్కోవద్దని హితవు పలికారు. గ్రామంలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచి పతివాడ అప్పన్న, గ్రామ పెద్దలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.