అసిఫాబాద్: గోయోగాం గ్రామ శివారులో అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉంచిన 14 పశువులు పట్టివేత
అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉంచిన 14 పశువులను పట్టుకొని ఒకరిపై కేసు నమోదు చేసినట్లు వాంకిడి ఎస్సై మహేందర్ తెలిపారు. ఆదివారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. వాంకిడి మండలం గోయోగాం గ్రామ శివారులో శనివారం అర్ధరాత్రి అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉన్న పశువులను పోలీస్ సిబ్బందితో కలసి పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుకున్న 14 పశువులను కాగజ్ నగర్ గోశాలకు తరలించి,ఒకరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మహేందర్ తెలిపారు.