పెద్దవడుగూరు మండలం జి వెంకటాంపల్లి గ్రామంలో పశువైద్యాధికారి రమేష్, గ్రామ సర్పంచ్ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఉచిత పశు ఆరోగ్య వైద్య శిబిరం, చూడి గొర్రెల సీమంతం కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాడి పశువులు, లేగ దూడలు, గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందును తాపించారు. అనంతరం చూడి గొర్రెలకు సీమంతం నిర్వహించారు. 85 శాతం తో పశు బీమా పథకం ఉందని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.