పసుపుల వంతెన వరదలకు కొట్టుకుపోయి ఏళ్లు గడిచిన నేటికి నిర్మించకపోవడంతో అటు మీదుగా వెళుతున్న గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలుగుతుందని ఆయ గ్రామల ప్రజలు ఆదివారం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెంబి మండలం పసుపుల వంతెన గత 3 ఏళ్ళ క్రితం భారీ వరదలకు కొట్టుకుపోయి అటు మీదుగ గ్రామాలకు ఏటా వర్షాకాలం రాకపోకలకు అంతరాయం ఏర్పడిన ప్రభుత్వం,పాలకులు పట్టించుకోకపోవడం బాధాకరమని ప్రజలు మండిపడుతున్నారు. అత్యవసరం అయితే కనీసం ఆంబులెన్స్ వెళ్లడానికి దారి లేకుండ గ్రామాలు ఉండడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పసుపుల వంతెన నిర్మాణ పనులను చేపట్టాలని కోరుతున్నారు.