వేములవాడ: ఆర్ ఆండ్ ఆర్ కాలని కార్మికులకు రెండు నెలల జీతాలు వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ డిమాండ్
గ్రామపంచాయతీ కార్మికులకు పెండింగ్ లో ఉన్న రెండు నెలల జీతం చెల్లించాలని ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు డిమాండ్ చేశారు. వేములవాడ పట్టణంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వేములవాడ అర్బన్ మండలం ఆర్ అండ్ ఆర్ కాలనీ చీర్లవంచ గ్రామపంచాయతీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈనెల 21వ తేదీన భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా మూడవ మహాసభ కరపత్రం ఆవిష్కరించారు.