మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలోని అల్లినగరం గ్రామ సమీపంలో ఆటోని లారీ ఢీ కొట్టి ఆగకుండా వెళ్లిపోయిన ఘటన చోటుచేసుకుంది. జరిగిన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నాగరాజు సోమవారం తెలిపారు. ప్రమాదం జరిగాక మరో లారీ ఆటోని తప్పించే క్రమంలో అదుపుతప్పి పొలాలలోకి దూసుకు వెళ్ళింది. లారీ ముందు భాగం ధ్వంసం అయింది లారీ డ్రైవర్ కు కూడా ప్రాణాపాయం తప్పినట్లుగా తెలిపారు. జరిగిన సమాజంలో ఆటోలో ఉన్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి.