వేములవాడ: పల్లిమక్త గ్రామంలో కోతుల దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారి
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెందిన చిన్నారి గడ్డమీది శ్రీలేఖ్య కోతి దాడిలో గాయపడింది. చిన్నారి ఇంటి ముందు ఆడుతుండగా చింతచెట్టు వద్ద ఉన్న కోతి ఒక్కసారిగా బాలికపై దాడి చేయటంతో కేకలు వేసింది. దీంతో కుటుంబ సభ్యులు వచ్చిన కోతిని తరిమికొట్టారు. కోతి దాడిలో గాయపడిన చిన్నారిని వేములవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కోతుల బెడద నుండి తమను రక్షించాలని ప్రజలు కోరుతున్నారు.