సిర్పూర్ టి: బెల్లంపల్లి సోషల్ వెల్ఫేర్ పాఠశాల ఎదుట సరైన వసతులు లేవని సిర్పూర్ టి విద్యార్థుల ఆందోళన
బెల్లంపల్లి సోషల్ వెల్ఫేర్ పాఠశాల ఎదుట సిర్పూర్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. సిర్పూర్ పాఠశాల భవనం చేతిలో వస్తులో ఉన్నందున 140 మందిని విద్యార్థులను బెల్లంపల్లికి మార్చారు. అక్కడ కూడా కనీస సౌకర్యాలు లేవని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 11 గంటలకు టిఫిన్, మధ్యాహ్నం 3 గంటలకు భోజనం ఇస్తున్నారని ఉపాధ్యాయులు సమస్యను పట్టించుకోవడంలేదని విద్యార్థులు ఆరోపించారు. తాము ఇక్కడ కూడా ఉండమని అన్ని వసతులు ఉన్నచోటే తమను మార్చాలని విద్యార్థులు డిమాండ్ చేశారు,