సంగారెడ్డి: ఇచ్చిన హామీ మేరకు మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది: టిజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తుందని మహిళల అభివృద్ధికి కృషి చేస్తుందని టీజీఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. ఆదివారం ఇందిరమ్మ మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి దామోదర్ రాజనర్సింహతో పాటు టీజీఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొని మాట్లాడారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాల ద్వారా మహిళల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో రకాల కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ కాంగ్రెస్ నాయకులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.