కనిగిరి నియోజకవర్గం బొట్లగూడూరులో మహేష్ పై దాడికి పాల్పడినవారిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలని పలువురు సోమవారం నిరసన చేపట్టారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకున్న రజక సంఘం నాయకులు ఈ మేరకు నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ, మహేష్ పై దాడికి పాల్పడినవారిని చట్టరీత్యా కఠినంగా శిక్షించాలని వారు కోరారు.