ఇల్లందు: ఇల్లెందు పట్టణంలోని హాస్టల్ వర్కర్లు నిరసన
ఇల్లందు జగదాంబ సెంటర్ లో మానవ హారం నిర్వహించిన హాస్టల్ వర్కర్లు గత 16 రోజుల నుండి నిరవదిక సమ్మె చేస్తున్న ఆశ్రమ పాఠశాలు, హాస్టల్లు, పీ ఎం హెచ్ హాస్టల్ లలో పనిచేస్తున్న డైలీ వేజ్ ఔట్ సోర్సింగ్ వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్ సాధన కోసంనిరసనలు చేస్తున్నారు. ప్రభుత్వం ఆదివాసి, గిరిజన ఇతర పేద వర్కర్ల తో వెట్టిచాకిరి చేయించుకుంటున్నదని ప్రభుత్వం నుండి వారికి ప్రతి నెల 35 వేల రూపాయలు చెల్లించాలని, డ్యూటీలో చనిపోయిన వర్కర్స్ కు 5 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని సీఐటీయు జిల్లా నాయకులు అబ్దుల్ నబీ, తాళ్లూరి కృష్ణ లు డిమాండ్ చేశారు .