అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం లోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం సాయంత్రం పల్లకి సేవ ఉత్సవాన్ని దేవాదాయ శాఖ అధికారులు ఆలయ అర్చకులు భక్తులు కలసి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పల్లకి సేవ ఉత్సవంలో భాగంగా స్వామివారి మూలవిరాట్ కు ప్రత్యేక పంచామృతాభిషేకాలను నిర్వహించారు. అనంతరం పల్లకి సేవతో ప్రదక్షణాలను నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.