చీమకుర్తి మండలం మర్రి చెట్ల పాలెం వద్ద ఆదివారం లారీ అదుపు తప్పింది. కేబుల్ వేసేందుకు తవ్విన గుంతలో గ్రానైట్ లారీ అదుపుతప్పి కూరుకుపోయింది. దీంతో ఆ రహదారి గుండా వెళ్లే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గ్రానైట్ లోడు లారీలో ఉండడంతో అదుపుతప్పిన సమయంలో గ్రానైట్ రాళ్లు కింద పడితే రద్ద ప్రమాదమే జరిగి ఉండేది. గ్రానైట్ యజమానులు జెసిబి సహాయంతో లారీని పక్కకు తప్పించడంతో ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా వాహనాలు ముందుకు సాగాయి.