శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం ఎన్పీ కుంట జడ్పీ హైస్కూల్ విద్యార్థిని వైష్ణవి మాక్ అసెంబ్లీకి ఎంపికయింది. మండలం నుంచి ఇద్దరు విద్యార్థులు ఎంపిక కాగా వైష్ణవి, గూటిబైలు జడ్పీ హైస్కూల్ విద్యార్థి లిఖిత్ రెడ్డిని ఎంపిక చేశారు. మొదటి స్థానంలో నిలిచిన వైష్ణవిని కాకుండా రెండో స్థానంలో ఉన్న లిఖిత్ రెడ్డిని ఎంపిక చేశారని వైష్ణవి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ అమ్మాయికి న్యాయం చేసేలా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.