ఇబ్రహీంపట్నం: మన్సురాబాద్ లో నాలా పూడికతీత పనులను అధికారులతో కలిసి పరిశీలించిన కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి
మనసురాబాద్ లో నాలా పూడికతీత పనులను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి శనివారం మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఈ పనులు మనసురాబాద్ నుండి నాగోల్ డివిజన్ వరకు సాగుతాయని తెలిపారు. ప్రజలు వాహనదారులు రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతుండడంతో నాలాపొడిగా తీతను తొలగించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. స్పందించిన హైడ్రా అధికారులు పూడికతీత పనులను ప్రారంభించారని తెలిపారు.