శ్రీరంగాపూర్: పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకోబోతున్న శ్రీరంగాపురం రంగనాయక స్వామివారి ఆలయం
వనపర్తి నియోజకవర్గంలో శ్రీరంగపురం మండల కేంద్రంలోని శ్రీ రంగనాయక స్వామి వారి ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం 1కోటి 50 లక్షలు మంజూరు చేసినట్లు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు పేర్కొన్నారు ఈ నిధుల మంజూరు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ కి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి కి ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు