నెల్లిమర్ల: కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమేష్ కుమార్ కి విజయవాడలో బి ఫారం అందజేసిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులురాలు షర్మిల
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సరగడ రమేష్ కుమార్ కి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల విజయవాడలో మంగళవారం బి ఫారం అందజేశారు.  నెల్లిమర్ల నియోజకవర్గ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సరగడ రమేష్ కుమార్ పోటీ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే నామినేషన్ వేయనున్నట్లు చెప్పారు. నెల్లిమర్ల నియోజకవర్గ ఓటర్లు హస్తం గుర్తుకు ఓటు వేయాలని ఆయన అభ్యర్థించారు.