పెబ్బేరు: పెబ్బేరు మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత
అనుమతులు తేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లను సోమవారం సాయంత్రం ఐదు గంటలకు పట్టుకుని కేసు నమోదు చేసినట్లు పెబ్బేరు ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురం గ్రామ శివారులోని కృష్ణా నది నుండి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు