పల్నాడు జిల్లాలో పెద్దపులి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పులి మృతి పై దర్యాప్తు చేపట్టిన అటవీ శాఖ అధికారులు గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడం వల్ల మృతి చెందినట్లుగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మహేష్ బాబు వెల్లడించారు. పల్నాడు జిల్లా మీదుగా హైదరాబాద్ కు వెళ్లే నేషనల్ హైవే 565 పై ఈ దుర్ఘటన జరిగిందని మృతి చెందిన పులి T170 ఫిమేల్ టైగర్ అని మహేష్ బాబు తెలిపారు. దీనికి వయసు రెండు సంవత్సరాల వరకు ఉంటుందని పూర్తి విచారణ అనంతరం నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు.