శ్రీరంగాపూర్: తాటిపాముల గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మెగా రెడ్డి
శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన శ్రీరంగాపూర్, మండలాల్లో పర్యటించి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు ముందుగా శ్రీరంగాపూర్ మండలం తాటిపాముల గ్రామంలో రూ.70 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూ.18 లక్షల వ్యయంతో పాఠశాలలో అదనపు గదుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. కంబాళాపూర్, షేరుపల్లి, వెంకటాపూర్ గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు శ్రీరంగాపూర్ మండలకేంద్రం నుంచి రంగవరం నుంచి ఫార్మేషన్ రోడ్డు నిర్మాణ పనులు, కేజీబీవీ స్కూల్ కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను ప్రారంభించారు