ప్రముఖ హేతువాద ఉద్యమ నేత, కవిరాజు శ్రీ త్రిపురనేని రామస్వామి చౌదరి జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఏఆర్ కార్యాలయ ప్రాంగణంలో ఆర్ఐ సీతారామిరెడ్డి, పోలీస్ అధికారులు మరియు సిబ్బంది ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శ్రీ త్రిపురనేని రామస్వామి చౌదరి కృష్ణా జిల్లా అంగలూరులోని రైతు కుటుంబంలో జన్మించారని తెలిపారు. తెలుగు సాహిత్యం ద్వారా సమాజంలోని మూఢనమ్మకాలపై పోరాటం చేసి, అంటరానితనం, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా తన కలాన్ని ఆయుధంగా మలిచిన మేధావి అని కొనియాడారు.