శ్రీకాకుళం: ఈనెల 27న నగరంలోని టౌన్ హాల్ వేదికగా జిల్లా స్థాయి పెన్సింగ్ పోటీలు : పెన్సింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాజ
ఈ నెల 27 వ తేదీన శ్రీకాకుళం నగరంలోని టౌన్ హల్ వేదికగా జిల్లా స్థాయి పెన్సింగ్ పోటీలను నిర్వహించి, అదే రోజు రాష్ట్ర స్థాయి పోటీలకి ఎంపిక చేయబడునని పెన్సింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బలబద్రుని రాజ బుధవారం తెలిపారు. అండర్ 17 బాయ్స్ అండ్ గర్ల్స్ విభాగాలలో ఈ పోటీలు నిర్వహించబడునని, జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనభరిచిన క్రీడా కారులను ఈ నెల 28,29 తేదీల్లో కాకినాడ లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ నందు జరగబోయే ఇంటర్ డిస్టిక్ క్యాడర్ పెన్సింగ్ ఛాంపియన్ షిప్ 2024,25 పోటీలకు ఏంపిక చేయడం జరుగుతుందని తెలిపారు.