కళ్యాణదుర్గం లోని వెలసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో మంగళవారం మాఘమాసాన్ని పురస్కరించుకొని వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు, ఆర్యవైశ్య సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఆత్మార్పణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం, కుంకుమార్చన, మూల మంత్ర హోమం వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.