ధర్మారం: గుర్తు తెలియని వాహనం డీకొని వ్యక్తి మృతి. ఆదిలాబాద్ జిల్లా వాసిగా గుర్తింపు..?
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ శివారులో శనివారం రోజున రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృత దేహాన్ని శవపరీక్ష కోసం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక మృతి వద్ద ఓ ఆధార్ కార్డ్ లభ్యమైంది. ఆ కార్డులో ఉన్న వివరాల ప్రకారం దుర్గం జీవన్ దాస్, గ్రామం రుద్రాపూర్, జిల్లా ఆదిలాబాద్ అని ఉంది. ఈ రోడ్డు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.