పెగడపల్లె: పెగడపల్లి మార్కెట్ యార్డును సందర్శించిన అగ్రికల్చర్ మార్కెటింగ్ ఈఈ మారపల్లి ఎల్లేష్
పెగడపల్లి మండల కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డును అగ్రికల్చర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మారపల్లి ఎల్లేష్ ఏఎంసీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ తో కలిసి గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డులో ఉన్న బండరాళ్లను తొలగించి ధాన్యం ఆరబోయడానికి త్వరలో ప్లాట్ఫారం నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.