పామూరు మండలం బోట్ల గూడూరు పంచాయతీ పరిధిలోని అపమాంబ పురంలో పశు వైద్యాధికారులు సోమవారం పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర టిడిపి విభిన్న ప్రతిభావంతుల ప్రధాన కార్యదర్శి అడుసుమిల్లి ప్రభాకర్ చౌదరి పశువైద్యాధికారులతో కలిసి పశుపోషకులకు నట్టల నివారణ మందుతో పాటు వ్యాధినిరోధక టీకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ ... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పశువైద్య శిబిరాలను పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.