సిర్పూర్ టి: మందుబాబులకు అడ్డాగా మారిన గూడెం వంతెన, తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
చింతల మానేపల్లి మండలం గూడెం వంతెన మందు బాబులకు అడ్డాగా మారింది. గూడెం సమీపంలోని మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ప్రాణహిత నదిపై నిర్మించిన వంతెనపై మందుబాబులు మందు బాటిల్లను ఇష్టానుసారంగా పడవేసి పగలగొడుతున్నారు. ప్రతినిత్యం వందలాదిమంది వంతెన మీదుగా ప్రయాణం చేస్తుంటారు పగలగొట్టిన బాటిళ్లు గుచ్చుకొని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు వాహనదారులు వాపోతున్నారు. వంతెన పై మద్యం సేవిస్తున్న వారిపై పోలీసులు కట్టిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు,