మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండల కేంద్రంలో వెలిసిన బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారికి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో సారె పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. స్థానిక మహిళలు మంగళ వాయిద్యాల నడుమ కుంకుమ భరణిలు పసుపు కుంకుమ గాజులు పూలమాలతో కూడిన సారెను తలలపై మోస్తూ గ్రామంలో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేసి సారెను సమర్పించారు