పండిత్ దీన్ దయాల్ జి జీవితం ప్రతి భారతీయుడికి ప్రతి కార్యకర్తకు ఆదర్శవంతమని భాజపా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి అన్నారు గురువారం వికారాబాద్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మార్గదర్శకుడు జాతీయత మానవతవాది పండిట్ దీన్ దయ ఉపాధ్యాయ జయంతిని నిర్వహించారు ఇందులో భాగంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు