గుంతకల్లు నియోజకవర్గంలో చికెన్, మటన్ ధరలు కొండెక్కాయి. కిలో చికెన్ ధర ఏకంగా రూ.280 చేరింది. ఆదివారం కావడంతో కొన్నిచోట్ల రూ. 290 కూడా విక్రయిస్తున్నారు. మటన్ ధరలు కూడా రెక్కలు వచ్చాయి. కిలో 750 నుంచి 800 కి పెంచారు. దీంతో చికెన్, మాంసం ప్రియులు ఇబ్బందులకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి చికెన్, మటన్ ధరలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.