భీమిలి: కాజ్ వేప్ పై కొండ చిలువ హల్ చల్ భయాందోళనకు గురయ్యిన గ్రామస్థులు
భీమిలి మండలం, తాటితూరు గ్రామం తాటితూరు పంచాయతీ పరిధిలో గోస్తని నదిపై నిర్మించిన కాజ్ వే పై గురువారం కొండ చిలువ హల్ చల్ చేసింది. రాత్రి వేళ కొండ చిలువ తిరుగుతూ కనిపించటంతో స్థానికులు చూసి భయబ్రాంతులకు గురయ్యారు. గ్రామ యువకులు తమ చరవాణీల్లో ఈ దృశ్యాన్ని బంధించారు. కొండ చిలువలతో పాటు భయంకరమైన విషసర్పాలు కూడా తిరుగుతున్నాయని, చీకటిలో చాలా ప్రమాదకరమని చెబుతూ గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్నారు.