గొట్టిప్రోలు గ్రామంలో అంబేద్కర్ విగ్రహ దిన్నె ధ్వంసం
తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం గొట్టిప్రోలు గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ స్థాపన కోసం ఏర్పాటు చేసిన దిన్నెను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. విషయం తెలిసిన వెంటనే దళిత బహుజన నాయకులు సంఘటనా స్థలానికి చేరుకొని ధ్వంసంమైన దిన్నే వద్ద నిరసన తెలిపారు. ఈ దాడిని దళిత భావాజాలంపై జరిగిన అవమానకర చర్యగా భావిస్తూ దళిత బహుజనులు సంఘటితంగా ముందుకు వచ్చి ఈ అన్యాయాన్ని ప్రశ్నించాలని పలువురు దళిత నాయకులు పిలుపునిచ్చారు. శనివారం అర్ధరాత్రి పైన ఈ సంఘటన జరగగా ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో నిరసన వ్యక్తపరిచార