రాజేంద్రనగర్: కొత్తూరు మున్సిపాలిటీ కేంద్రంలో ప్రేమ జంట ఆత్మహత్య
కొత్తూరు మున్సిపాలిటీ కేంద్రంలోని ఓ ఇంట్లో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికుల వివరాలు.. ఇంట్లో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడగా, యువతి నిర్జీవంగా బెడ్ పై పడి ఉంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.