కుప్పం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద విభిన్న ప్రతిభావంతులు సీఎం చంద్రబాబు చిత్రపటానికి సోమవారం పాలాభిషేకం చేశారు. విభిన్న ప్రతిభావంతులను గుర్తించిన సీఎం చంద్రబాబు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారని వారు కొనియాడారు. అనంతరం సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు మురళీ తదితరులు పాల్గొన్నారు.