చింతపల్లి మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన చెరువులవేనం గ్రామానికి రహదారి నిర్మాణ పనులు పూర్తి చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ మార్గంలో గుంతలు ఏర్పడి, బండరాళ్లు అడ్డంగా పడ్డాయి. దీంతో సొంతంగా శ్రమదానంతో భారీ బండరాళ్లు తొలగిస్తూ గుంతలు పూడ్చుతున్నట్లు గ్రామస్థులు గురువారం తెలిపారు. ఆ మార్గంలో సుమారు రూ.2.40 కోట్లతో బీటీ రోడ్డు మంజూరైనా ఇంకా పనులు ప్రారంభించలేదన్నారు. వెంటనే రహదారి నిర్మాణ పనులు పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.