సదాశివ నగర్ : భార్యపై రాయితో దాడి చేసి హత్య చేసిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. సదాశివనగర్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీనివాస్ రావు వివరాలు వెల్లడించారు. సదాశివనగర్ గ్రామానికి చెందిన చిందం రవి కుటుంబ కలహాల కారణంగా ఈనెల 22న రాత్రి తన భార్య లక్ష్మి (40)పై బండరాయితో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న కుమారుడు సురేష్ 23న ఉదయం ఇంటికి వచ్చాడు. తల్లి మృతదేహం కనిపించడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. నిందితుడిని రిమాండ్ కు తరలించారు.