నల్గొండ జిల్లా, తిప్పర్తి మండల కేంద్రంలోని నర్రా రాఘవరెడ్డి భవన్ లో కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నన్నూరి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ.. భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో ప్రథమ పాత్ర పోషించిన వ్యక్తి కామ్రేడ్ సీతారాం ఏచూరి అని కొనియాడారు. దక్షిణాది రాష్ట్రాలలో కమ్యూనిస్టు పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేసి ఢిల్లీ యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ ఉద్యమంలో గొప్ప నాయకుడిగా పని చేశారని తెలిపారు.