వ్యవసాయ అవసరం కోసం తప్పనిసరి అవసరమైన సమయంలో యూరియా లభించడం లేదని రైతులు ఆవేదన పడుతున్నారు.నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కు నిన్న కొన్ని బస్తాల యూరియా వచ్చిందని తెలిసిన రైతులు నేటి తెల్లవారుజామున వచ్చిన రైతులు తమకు బదులుగా తమ చెప్పులను క్యూ లో ఉంచారు.ఉదయం వచ్చిన అధికారులు తమ దగ్గర ఉన్న బస్తాలను రైతు ఒక్కరికి రెండు చొప్పున అందించారు కొంత మంది యూరియా దొరకని రైతులు అధికారులతో వాగ్వివాదానికి దిగారు.వర్షాలకు పంటలు బాగా నాని మురిగిపోయే దశలో ఉన్నాయని వాటికి యూరియా అవసరమని లేకపోతే మేము నష్టపోవాల్సి ఉంటుంది అని ఇప్పటికైనా ఉన్నత అధికారులు రైతులకు సరి